Pragya Jaiswal: ఏజ్ గ్యాప్ పై స్పందించిన ప్రగ్యా
అఖండ(AKhanda)తో పాటూ మొన్న సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాలో కూడా బాలయ్య(Balayya) పక్కన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) నటించింది. ఈ నేపథ్యంలో బాలయ్యకు, ప్రగ్యా కు మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందని, ఇద్దరూ కలిసి జోడీగా ఎలా నటించారని విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రగ్యా రీసెంట్ గా స్పందించింది.
తనకు, బాలయ్యకు మధ్య వయసు తేడా మాట నిజమే అయినప్పటికీ అదసలు మ్యాటరే కాదని, స్క్రీన్ పైన ఇద్దరినీ కలిసి చూసినప్పుడు బాగా కనిపిస్తే చాలని తెలిపింది. అంతేకాదు, పాత్రను ఎలా డిజైన్ చేశారో దాన్ని బట్టే నటులను ఎంపిక చేసుకుంటారని, ఇక తన విషయంలో పాత్రకు న్యాయం చేయగలననిపిస్తేనే ఆ సినిమాలో నటిస్తానని, ఏజ్ గ్యాప్ లాంటి విషయాలను అసలు పట్టించుకోనని ప్రగ్యా తెలిపింది.
ఈ సందర్భంగా బాలయ్య గురించి మాట్లాడుతూ ఆయనతో కలిసి రెండు సినిమాలు చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఆయన పక్కన ఉంటే పాజిటివిటీ ఉంటుందని, ఆయన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలిపింది. తన పుట్టిన రోజు నాడు రిలీజైన డాకు మహారాజ్ హిట్ అవడంతో కొత్త ఏడాది తనకు మంచి ఆరంభాన్నిచ్చిందని తెలిపింది.













