Pragya Jaiswal: ప్రకృతి అందాల నడుమ మరింత అందంగా ప్రగ్యా
కంచె(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్డమ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ప్రగ్యా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతున్నా స్టార్ హీరోలతో నటించలేకపోయింది. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో నటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ప్రగ్యా షేర్ చేసే ఫోటోల ద్వారా అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ప్రగ్యా నేపాల్ కు వెకేషన్ కు వెళ్లి అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో వైట్ టాప్, బ్లూ కలర్ టైట్ జీన్స్ ధరించి ప్రకృతి అందాల మధ్య మరింత అందంగా కనిపిచింది ప్రగ్యా(Pragya). అమ్మడు షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













