Pradeep Ranganathan: కాంట్రవర్సీ కథాంశంతో ప్రదీప్ మూవీ
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఓ వైపు యాక్టర్ గా సత్తా చాటుతూనే మరోవైపు డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే డ్రాగన్(Dragon) తో హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రదీప్ ఇప్పుడు రెండు క్రేజీ మూవీస్ చేస్తున్నాడు. అందులో ఒకటి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) కాగా మరోటి కీర్తిశ్వరన్(Keertiswaran) అనే కొత్త దర్శకుడితో తెరకెక్కుతున్న సినిమా.
దాదాపు ఆఖరి దశకు చేరుకున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ని ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కథ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ లీక్ బయటికొచ్చింది. అయితే ఇప్పుడు LIK మూవీ కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికొచ్చి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమా కథాంశం 10 ఏళ్ల భవిష్యత్తులో ఉంటుందని, తండ్రీ, కొడుకు ఇద్దరూ ఒకే కాల్ గర్ల్ తో ప్రేమలో పడతారని తెలుస్తోంది. ఈ పాయింట్ వినడానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ వివాదాలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇదే స్టోరీ లైన్ తో తమిళంలో మూగ సినిమా సింధు సమవేలిని వచ్చింది. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న విఘ్నేష్ శివన్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













