Pradeep Ranganathan: మైత్రీతో హిట్ హీరో సినిమా
టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ గా పేరు సంపాదించుకున్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన శ్రీమంతుడు(Srimanthudu) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమై తక్కువ కాలంలోనే మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థగా నిరూపించుకుంది. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే అందరి దృష్టి ఆ మూవీపైనే ఉండే స్థాయికి మైత్రీ సంస్థ ఎదిగింది.
రీసెంట్ గా పుష్ప2(Pushpa2) సక్సెస్ తర్వాత మైత్రీ స్థాయి మరింత పెరిగిందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా మైత్రీ సంస్థ సినిమాలను నిర్మిస్తుంది.
అందులో భాగంగానే మైత్రీ సంస్థ ఓ బైలింగువల్ సినిమాను ప్లాన్ చేసింది. లవ్ టుడే(Love Today), డ్రాగన్(Dragon) తో మంచి హిట్లు అందుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ మూవీ చేయనుందని మొన్న ఈ మధ్య వార్తలు రాగా, ఆ విషయాన్ని ఇప్పుడు డ్రాగన్ ప్రమోషన్స్ లో భాగంగా స్వయంగా ప్రదీపే వెల్లడించాడు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్టు ప్రదీప్ తెలిపాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు అనౌన్స్ కానుందని తెలుస్తోంది.













