Pradeep: పొలిటీషియన్ తో పెళ్లి గురించి ప్రదీప్ ఏమంటున్నాడంటే
యాంకర్ గా బాగా పాపులర్ అయిన ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్న ప్రదీప్ పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఓ పొలిటీషియన్ ను ప్రదీప్ పెళ్లి చేసుకోనున్నాడని వస్తున్న వార్తలపై ప్రదీప్ రీసెంట్ గా రెస్పాండ్ అయ్యాడు.
సరైన టైమ్ వచ్చినప్పుడు అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రదీప్, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందని, కెరీర్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామనుకోవడంతో కాస్త లేటైందని, కాకపోతే అన్నీ సరైన టైమ్ లోనే జరుగుతాయనే నమ్మకముందని ప్రదీప్ చెప్పాడు. పొలిటీషియన్ తో పెళ్లి గురించి మాట్లాడుతూ గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటానని అన్నారు, ఇప్పుడు పొలిటీషియన్ అంటున్నారు, రేపు క్రికెటర్ అంటారేమో. అవన్నీ పుకార్లు మాత్రమేనని ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు.
ప్రదీప్ హీరోగా నటించిన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbay) ఏప్రిల్ 11న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ప్రదీప్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా విషయానికొస్తే దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో భరత్(Bharath), నితిన్(Nithin) దర్శకులుగా పరిచయమవుతున్నారు.













