Prabhas: ఈ ఏడాది ప్రభాస్ నుంచి మూడు సినిమాలా?
2023లో ఆదిపురుష్(Adhipurush), సలార్(Salaar) సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్(Prabhas) గతేడాది కల్కి(Kalki)ని మాత్రమే రిలీజ్ చేశాడు. ప్రతి ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ప్రభాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి(Maruthi) దర్శకత్వంలో రాజా సాబ్(raja Saab) సినిమా చేస్తున్న ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఎన్ని సినిమాలు రిలీజవుతాయనేది అందరిలో ఆసక్తి రేపుతుంది.
అన్నీ సరిగా ఉండుంటే రాజా సాబ్ ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ లో రిలీజ్ కాకపోయినా మే లో సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన కన్నప్ప(Kannappa) సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
కన్నప్పలో ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడనేది తెలియదు కానీ ఆ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేశాడో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజా సాబ్ తో పాటూ ప్రభాస్ హను రాఘవపూడి(hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ను ఇప్పటికే పూర్తి చేసిన హను మొత్తం సినిమాను సమ్మర్ లోపే పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది. అంటే ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే 2025లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలొస్తాయని అర్థమవుతుంది. అదే నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే. ప్రభాస్ కెరీర్ లో ఇప్పటివరకు ఏ ఏడాదీ మూడు సినిమాలు రిలీజైంది లేదు. ఇప్పుడు రిలీజైతే అది రికార్డే అవుతుంది.













