రాజా సాబ్‌లో ప్రభాస్ ట్రిపుల్ గెటప్స్?
కమర్షియల్ సినిమాలు చేసే టాలీవుడ్ స్టార్ హీరోలు దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాల జోలికి వెళ్లరు. స్టార్ డైరెక్టర్లు కూడా ఆ నేపథ్యంలో సినిమాలు చేసి రిస్క్ తీసుకోవాలని ఆలోచన చేయరు. హారర్ ప్లస్ స్టార్ హీరో అనే కాంబినేషన్ రీసెంట్ టైమ్ లో ఎవరూ ఊహించలేదు. కానీ డైరెక్టర్ మారుతి(maruthi) ప్రభాస్(prabhas) తో ఆ రిస్క్ చేస్తున్నాడు.
అయితే హారర్ జానర్ లో వచ్చిన సినిమాలు సక్సెస్ అయితే ఏ రేంజ్ కు వెళ్తాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కానీ దెయ్యాన్ని ఎలివేట్ చేస్తూ ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇమేజ్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో అనే దాని గురించే అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ రాజాసాబ్(the raja saab) విషయంలో మారుతి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు.
ఇందులో హీరోనే ఆత్మ రూపంలో చూపించనున్నాడు. మొన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ద్వారా ఈ మ్యాటర్ అర్థమైపోయింది. అంతేకాదు ప్రభాస్ మరో రెండు పాత్రల్లో కనిపిస్తాడని కూడా క్లారిటీ వచ్చింది. అందులో ఒకటి రాజు గారి పాత్ర మరోటి లవర్ బాయ్ తరహాలోని పాత్ర. అయితే పాత్రలు రెండే అయినా గెటప్స్ మాత్రం మూడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్‌లో దెయ్యంగా మారకముందు గెటప్‌లో ప్రభాస్ మరింత ఆకట్టుకుంటాడని సమాచారం. ఏదేమైనా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇలాంటి కథలను హ్యాండిల్ చేయడాన్ని అభినందించాల్సిందే.













