ఆ స్టార్ హీరోతో శ్రీలీల
చిన్న హీరో, పెద్ద హీరో అని సంబంధం లేకుండా వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతున్న టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల చేతిలో ప్రస్తుతం 9 సినిమాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కు రెడీ కాబోతున్నాయి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, తన రెండో సినిమానే రవితేజతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ధమాకా సూపర్ హిట్ అవడంతో దాని తర్వాత అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ వారంలో అమ్మడు నటించిన స్కంద సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత దసరాకు భగవంత్ కేసరి, నవంబర్ లో ఆదికేశవ్, డిసెంబర్ లో నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలతో రానుంది. వచ్చే ఏడాది జనవరిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న శ్రీలీల తర్వాత విజయ్ దేవరకొండ, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా చేస్తుంది.
ఇప్పుడు శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేయనున్న సినిమాలో శ్రీలీల ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్కోరీ డిస్కషన్స్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయని సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.













