ప్రభాస్ పెళ్లి ప్రకటనకి ముహూర్తం ఖరారు !
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తీరబోతోందట. అక్టోబర్ 23న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన పెళ్లికి సంబంధించిన కీలక ప్రకటనను ఆయన కుటుంబ సభ్యులు వెలువరించనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, యూవీ క్రియేషన్స బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది. మరోవైపు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు ప్రభాస్.













