దారిచ్చారు… ధన్యవాదాలు
డార్లింగ్ మళ్లీ స్ట్రాటజీ చూపించాడు. తానొవ్వక నొప్పింపక.. ఒక్క రిక్వెస్ట్‌తో వందమార్కులు కొట్టేశాడు. కేవలం సాహోకి దారిస్తూ రేసునుంచి పక్కకి జరిగిన నాలుగు సినిమాలకు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పాడు. నిజానికి సాహో ఆగస్టు 15న థియేటర్లకు రావాల్సి ఉంది. దాంతో సౌత్‌లోని పెద్ద సినిమాలు వాటి విడుదల స్లాట్స్‌ను సిద్ధం చేసుకున్నాయి. అయితే, పోస్ట్ ప్రొడక్షన్స్ లేట్ కారణంగా సాహో రిలీజ్ డేట్ ఆగస్టు 30కి జరిగింది. అయితే పెద్ద సినిమాలకు స్క్రీన్స్ ప్రాబ్లెమ్ తలెత్తింది. దాంతో సాహోకి మిగిలిన దర్శక, నిర్మాతలు దారిచ్చేశారు. తమ సినిమాలు రీషెడ్యూల్ చేసుకున్నారు. దీనిపై ప్రభాస్, యూవీ క్రియేషన్స్ స్పందిస్తూ సోషల్ మీడియాలో బిగ్ థాంక్స్ పోస్ట్ పెట్టారు. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆయా సినిమాలకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు డార్లింగ్ ప్రభాస్. బ్లాక్‌బస్టర్ బహుబలి తరువాత ప్రభాస్ చేస్తోన్న భారీ ప్రాజెక్టు సాహో.













