స్పిరిట్.. ఊహకే గూస్బంప్స్ తెప్పిస్తాడేమో!
అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నప్పుడు అక్కడి విశ్లేషకులు దాన్ని వయొలెంట్ సినిమా అన్నారు. అసలు హింస అంటే ఏంటో, ఎలా ఉంటుందో తన తర్వాతి సినిమాలో చూపిస్తానని అప్పుడు సందీప్ రెడ్డి వంగ చెప్పిన మాటలు ఇప్పుడు యానిమల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత వైరల్ అవుతున్నాయి.
యానిమల్‌లో రణ్‌బీర్ కపూర్ ను ఆవిష్కరిస్తూ, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఇలాంటి సినిమా కూడా తీయొచ్చా అనేలా సందీప్ రెడ్డి వంగ రూపొందించాడు. యానిమల్ సినిమాకే ఈ రేంజ్లో జనాలకు పూనకాలు వస్తుంటే, ఇక సందీప్ చేసే తర్వాతి సినిమా స్పిరిట్‌కు జనాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు.
ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. భయం లేని ఓ కరుడు గట్టిన పోలీసాఫీసర్ స్టోరీని స్పిరిట్ లో చెప్పబోతున్నాడు సందీప్. ఆ కథకు ప్రభాస్ లాంటి హీరో తోడైతే బాక్సాఫీస్ దగ్గర నెక్ట్స్ లెవెల్ విధ్వంసం జరగడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ ను ఇప్పటివరకు సరిగా వాడుకున్న డైరెక్టర్ లేడు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఏ రేంజ్లో వాడుకున్నాడన్నది సలార్ వస్తే కానీ తెలియదు. ఈ నేపథ్యంలోనే సందీప్ తో చేసే స్పిరిట్ పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. స్పిరిట్ కూడా సందీప్ స్టైల్లోనే వయొలెంట్ గా ఉంటుంది. రణ్‌బీర్ లాంటి హీరోకే ఇంత ఎలివేషన్ ఇచ్చిన సందీప్ కు ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఫ్యాన్స్ తెగ ఊహించుకుంటున్నారు. ఏదేమైనా స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లాలంటే 2025 వరకు ఆగాల్సిందే.













