ప్రభాస్- సందీప్ రెడ్డి వంగ సినిమా మొదలెప్పుడంటే?
ప్రభాస్ సలార్ తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ తో కల్కి, మారుతితో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా కల్కిను ఫినిష్ చేసి, ఆ తర్వాత మారుతి సినిమా విషయం చూసుకుందామనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నాడట. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం రణ్‌బీర్‌తో యానిమల్ మూవీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ, డిసెంబర్ 1న ఆ సినిమాను రిలీజ్ చేసేసి, వెంటనే ప్రభాస్ సినిమా పనిలో దిగనున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా సందీప్ సినిమా కోసం తన డేట్స్‌ను అడ్జస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభాస్-సందీప్ రెడ్డి వంగ సినిమా 2024 మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
స్పిరిట్ అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాతో ఆడియన్స్‌కు నెక్ట్స్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సందీప్ ట్రై చేస్తున్నాడట. 2024 మార్చిలో సినిమాను మొదలుపెట్టి, ఇయర్ ఎండింగ్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలన్నది ప్రస్తుత ప్లాన్ గా తెలుస్తోంది. 2025 సమ్మర్ లేదా చివర్లో కానీ స్పిరిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా వీరు ప్లాన్ చేసుకుంటున్నారట. యానిమల్ హిట్ అయితే మాత్రం ప్రభాస్‌తో సందీప్ తీసే సినిమాపై ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. – సందీప్ రెడ్డి వంగ సినిమా మొదలెప్పుడంటే?













