కన్ఫర్మ్.. రెండు పార్ట్‌లుగా సలార్
ఈ మధ్య ఒకే సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయడం ఫ్యాషనైంది. బాహుబలి దగ్గర మొదలైన ఈ ట్రెండ్ తర్వాత కేజీఎఫ్, పుష్ప వీటతో పాటూ చాలా సినిమాలే ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా రానుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది.
కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రశాంత్ నీల్ గురించి తెలిసిందే కాబట్టి, ఈ సినిమాను కచ్చితంగా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు, ఆ నమ్మిన విషయాన్నే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసి, ఆఖరికి ప్రొడక్షన్ హౌస్ నుంచే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేయించారు.
రెండు భాగాలుగా రాబోతున్న సలార్ సినిమా పాన్ ఇండియన్ లెవల్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ను మొదట్లో చెప్పినట్లే సెప్టెంబరు 28న రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ రిలీజ్ టైమ్ లోపే సెకండ్ పార్ట్ లో కూడా కొంత భాగాన్ని చిత్రీకరించనున్నాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ కు ఉన్న మిగిలిన కమిట్మెంట్లపై రెండో భాగం రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది.
కాగా, సలార్ సినిమాలో ప్రభాస్ మాన్స్టర్గా కనిపించబోతున్నాడు. మోస్ట్ వయలెంట్ అనుకునే వాళ్లు అతన్ని మోస్ట్ వయలెంట్ అంటారు అని ప్రభాస్ క్యారెక్టర్‌కు ఇంతకుముందు వీడియోలో ఇచ్చిన ఎలివేషన్ సినిమాపై అందరికీ అంచనాలను భారీగా పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు హీరోయిన్ గా శృతి హాసన్ నటించనుంది.













