టీజర్ చూడాలంటే అలారం పెట్టుకోవాల్సిందే..
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయిందనడానికి ఆదిపురుష్ కలెక్షన్లే కారణం. ఈ సినిమాకు మౌత్ ఆఫ్ టాక్ బాలేకపోయినా సరే మూడొందల కోట్లు ఈజీగా కలెక్షన్లు తెప్పించగలిగాడు అంటే దానికి ప్రభాస్ స్టామినానే మెయిన్ రీజన్. ఆదిపురుష్ మానియా అయిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ పైనే ఉంది.
కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీగా అంచనాలున్నాయి. దానికి తోడు ఇప్పటికే లీక్ అయిన స్టిల్స్, వీడియోలు సినిమాపై హైప్‌ని బాగా పెంచుతున్నాయి. సలార్ సినిమాకు బిజినెస్ ఆఫర్లు కూడా భారీగా వస్తున్నట్లు టాక్. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ టీజర్ కు మేకర్ ముహూర్తం పెట్టారు. జులై 6వ తేదీ తెల్లవారుఝామున 5.12 గంటలకు సలార్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. చూస్తుంటే ఏదో ముహూర్తం చూసి మరీ టైమ్‌ను ఫిక్స్ చేసినట్లున్నారు. అంటే టీజర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లంతా ఉదయాన్నే అలారం పెట్టుకుని మరీ లేవాల్సిందే.
సలార్ టీజర్‌తో బిజినెస్ డీల్స్ మారిపోనున్నాయని మేకర్స్ చాలా బలంగా నమ్ముతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏరియాల వారీ రైట్స్‌ను అమ్మలేదు. టీజర్ తర్వాత ఎలాగూ బయ్యర్లు పోటీ పడతారు కాబట్టి ఆ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఒక పార్ట్‌లా రిలీజ్ కానుందా లేక రెండు భాగాలుగా రిలీజ్ కానుందా అనేది కూడా 6వ తేదీ తెలిసే ఛాన్సుంది.













