ఆర్ఆర్ఆర్ రికార్డ్ జస్ట్ మిస్
భగవంత్ కేసరి తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్ లేక థియేటర్లు అల్లాడిపోతున్న టైమ్ లో నిన్న రిలీజైన సలార్ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ఒక్కసారిగా బాక్సాఫీస్ కు ఊపిరి పోసింది. సలార్ మేనియా ఎన్ని రోజులుంటుందో ఇప్పుడే చెప్పలేం కానీ ప్రభాస్ స్టామినా చూసి తల పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
డంకీ వల్ల నార్త్ లో ఎక్కువ స్క్రీన్స్ దొరక్కపోయినా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం చూసి ప్రభాస్ స్థాయిని తక్కువ అంచనా వేయకూడదని అర్థం చేసుకున్నారు. కొన్ని ఏరియాల్లో సలార్, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ని సలార్ జస్ట్ కొంచెంలో మిస్ చేసుకుంది. నైజాంలో కేవలం రూ.80 లక్షల తేడాతో సలార్ డే1 రికార్డ్ ను మిస్ అయింది. పోటీగా డంకీ లేకపోతే నైజామ్ నెం.1 ప్లేస్‌ను సలార్ కచ్ఛితంగా దక్కించుకునేది.
సలార్ కు వచ్చిన టాక్ తో ఈ వీకెండ్ మొత్తం సలార్ దే హవా ఉండబోతుందన్నది అర్థమవుతుంది. దానికి తోడు ఫస్ట్ వీక్ లోనే క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి కాబట్టి ఈ కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి. ఉత్తరాదిలో కూడా సలార్ కు షోలు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే సలార్ సినిమా నాన్ రాజమౌళి రికార్డుల్లో టాప్ గా నిలవడం ఖాయం అనిపిస్తోంది.













