ఓ రేంజ్లో సలార్ ఓవర్సీస్ బుకింగ్స్
మరో 8 రోజుల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు అలక్ష్యం చేయడం పట్ల ఫ్యాన్స్ అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు.
కానీ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సింది. దాని కోసం ముందుగానే యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, ఆ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 3 కోట్ల మార్క్ ను అందుకుంది. కానీ సినిమా వాయిదా పడటంతో ఆ టికెట్ డబ్బుల్ని వెనక్కిచ్చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ యూఎస్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయగా, రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. సలార్ మూవీ మొత్తం 360 లొకేషన్స్ లో 1181షోలకు 23,000 టికెట్స్ అమ్మగా $6,25,684 అంటే రూ.5.21కోట్లను కలెక్ట్ చేసింది. బాహుబలి తర్వాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్‌కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం కానుంది.
ఈ ఫిగర్లు చూస్తుంటేనే ఆడియన్స్‌లో సలార్ మేనియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన రెస్పాన్ రావడంతో ఆ హైప్ మరింత పెరిగింది. కొత్త ట్రైలర్ ఉంటుందో లేదో ఇంకా తెలీదు కానీ ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హాఫ్ మిలియన్ దాటేసిన సలార్ రిలీజ్ లోపు రెండు మిలియన్లు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు.













