సలార్ కు అసలు పరీక్ష మొదలైంది
సలార్ మూవీకి ప్రమోషన్స్ చేయకపోయినా, ట్రైలర్లకు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినా, రెండు సాంగ్సే ఉన్నప్పటికీ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. దానికి తోడు సలార్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసింది లేదు. రిలీజ్ రోజు నుంచి క్రిస్మస్ అయ్యే వరకు నాన్ స్టాప్ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది సలార్.
కానీ సలార్ కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. హాలిడేస్ అయిపోయాయి. తెలంగాణలో ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు రెండో వారం నుంచి నార్మల్ రేంజ్ కు వస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఊపులో ఫస్ట్ నాలుగు రోజులు ఈ టికెట్ రేట్ పెంపు ప్రభావం సినిమాపై పెద్దగా కనిపించలేదు. కానీ వర్కింగ్ డేస్ స్టార్ట్ అయ్యాయి.
ఇప్పుడు సలార్ కు వచ్చే కలెక్షన్సే సినిమా స్థాయిని నిర్దేశించనున్నాయి. కలెక్షన్స్ లో డ్రాప్ ఉండటం మామూలే కానీ అది మరీ ఎక్కువ రేంజ్ లో ఉంటే సలార్ బ్రేక్ ఈవెన్ అవడం కష్టమవుతుంది. సలార్ కు అన్ని భాషల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం, కొన్ని ఏరియాల్లో డంకీ ఆధిపత్యం చెలాయించడం ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. మరి రెండో వారంలో సలార్ థియేటర్లలో ఎలా పెర్ఫార్మ్ చేయనుందో చూడాలి.













