సలార్ ఇంకెంత రాబట్టాలి?
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా సలార్ పది రోజుల రన్ ను పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ సంస్థ నుంచి ఫస్ట్ మూడు రోజుల్లా అఫీషియల్ నెంబర్లను అనౌన్స్ చేయడం లేదు కానీ ట్రేడ్ సమాచారం ప్రకారం, సలార్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది రూ.550 కోట్లకు లోపే.
షేర్ విషయానికొస్తే అది రూ. 300 కోట్లకు అటూ ఇటూగా ఉంటుంది. వీకెండ్ కు కూడా గొప్పగా పికప్ ఏమీ లేదు కానీ మెయిన్ సెంటర్స్ లో మాత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. న్యూ ఇయర్ కు కూడా సలార్ టికెట్లు బాగానే తెగాయి. కానీ సలార్ రూ. వెయ్యి కోట్ల మార్కు మాత్రం అసాధ్యంగానే కనిపిస్తుంది. మరో పది రోజుల్లో సంక్రాంతి సినిమాలు థియేటర్లలోకి వస్తాయి.
గుంటూరు కారం, హను మాన్ ముందు రిలీజ్ కానున్నాయి. ఆ టైమ్ కు సలార్ ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సలార్ స్క్రీన్స్ ఎక్కువగా హనుమాన్ను వెళ్లనున్నాయి. కాబట్టి సలార్ ఎంత వసూలు చేసినా జనవరి 11లోపే చేసేయాలి. కెజిఎఫ్ ను మించి ఆడుతుందనుకుని ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ గురించి ఎంతగానో ఊహించుకున్నారు కానీ అది జరిగేట్టు కనిపించడం లేదు.













