Prabhas: కన్నప్పలో ప్రభాస్ పాత్ర నిడివి అంతేనా
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న కన్నప్ప(Kannappa) షూటింగ్ ను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను మంచు మోహన్ బాబు(Mohan Babu), విష్ణు(Vishnu) నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం స్టార్ క్యాస్టింగ్ ను విష్ణు రంగంలోకి దించాడు. శరత్ కుమార్(sarath Kumar), మోహన్ లాల్(mohan lal), మోహన్ బాబు కన్నప్పలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఈ సినిమాలో శివుడిగా కనిపించనున్నాడు. ఆయన పాత్రకు సినిమాలో చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. అయితే అక్షయ్ కుమార్ పాత్ర నిడివి ఎంతన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు కన్నప్పలో డార్లింగ్ ప్రభాస్(Prabhas) కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే ప్రభాస్ కన్నప్పలో ఓ క్యామియో చేశాడు.
కన్నప్పలో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను డార్లింగ్ 2,3 రోజుల్లోనే పూర్తి చేశాడని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అంతే కాదు సినిమాలో ప్రభాస్ కనిపించేది కేవలం 5 నిమిషాలే అని, అందులో సగం షాట్స్ గ్రాఫిక్స్ తోనే ఉంటాయని చెప్తున్నారు. కాకపోతే ఆ 5 నిమిషాలు ఆడియన్స్ కు నెక్ట్స్ లెవెల్ ఎక్స్పీరియెన్స్ ఇస్తాయని అంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.













