కన్నప్ప కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్ఆనడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ప్రభాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కన్నప్పలో ప్రభాస్ నటిస్తున్నాడన్న విషయం తెలియగానే ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగింది.
ప్రస్తుతం ప్రభాస్ కన్నప్ప షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల కాల్షీట్స్ ను మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే కన్నప్ప కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మామూలుగా అయితే ఒక్క సినిమాకు ప్రభాస్ రూ.150 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ కాబట్టి ఎంత తీసుకుంటాడా అని అందరూ అనుకుంటుండగా ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. కన్నప్ప కోసం ప్రభాస్ అస్సలు రెమ్యూనరేషనే తీసుకోవడం లేదట. మోహన్ బాబు మీదున్న ప్రత్యేకమైన అభిమానంతో ఆయన అడగ్గానే ప్రభాస్ ఈ సినిమా చేస్తానని చెప్పడంతో పాటూ రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదని చెప్పినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతున్నది తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే.













