Raja Saab: ప్రభాస్ తప్పుకుంటే ముగ్గురు వెయిటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడది వాయిదా పడుతుందని టాలీవుడ్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజా సాబ్ వాయిదా పడుతుందనే కారణంతోనే సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) తన జాక్(Jack) సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రాజా సాబ్ కు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల రిలీజ్ వాయిదా పడుతుందని తెలుస్తోంది. అయితే రాజా సాబ్ తప్పుకుంటే ఆ ప్లేస్ లో రావడానికి మూడు సినిమాలు రెడీగా ఉన్నట్లు సమాచారం. జాక్ సినిమాను ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేయగా, నితిన్(Nithin) రాబిన్ హుడ్(Robinhood) కూడా అదే డేట్ పై కన్నేసినట్టు తెలుస్తోంది.
దీంతో పాటూ సన్నీ డియోల్(Sunny Deol), గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాట్(Jaat) సినిమాను కూడా ఏప్రిల్ 10నే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. నితిన్ రాబిన్హుడ్ ను వాస్తవానికి క్రిస్మస్ కే రిలీజ్ చేయాల్సింది కానీ కుదరలేదు. తర్వాత సంక్రాంతికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో శివరాత్రికి అనుకున్నారు. కానీ ఆ టైమ్ లో నితిన్ తమ్ముడు(Thammudu) సినిమా రిలీజ్ కు ఉంది. అందుకే రాబిన్హుడ్ ఏప్రిల్ 10పైన కన్నేసినట్టు తెలుస్తోంది.













