ప్రాజెక్ట్ కె కూడా రెండు పార్ట్లేనా?
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అతి పెద్ద సినిమా అంటే ప్రాజెక్ట్ కె అనే చెప్పాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకొనె నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని టాక్.
హాలీవుడ్ లెవల్ లో ఈ సినిమా ను నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కె గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే సలార్ సినిమాలానే ఈ సినిమా కూడా రెండు పార్ట్ లుగా రానుందట. 500 కోట్ల బడ్జెట్ ను తిరిగి రాబట్టుకోవాలంటే సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయడమే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట.
దానికి తోడు సినిమా రష్ చూసి ప్రాజెక్ట్ కె ను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయాలని డిసైడయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా రిలీజై మొదటి షో పడేవరకు సీక్రెట్ గా ఉంచాలని యూనిట్ సభ్యులు చూస్తున్నారు కానీ విషయం లీకైపోయింది. అంతే కాదు పార్ట్ 2 కి సంబంధించిన కొంత మేర షూటింగ్ కూడా పూర్తి అయినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.













