ప్రాజెక్ట్ కె ఫస్ట్ డీల్ అదుర్స్
వరుస పాన్ ఇండియన్ ఫిల్మ్స్‌తో బిజీగా ఉన్నాడు టాలీవుడ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా ప్రాజెక్ట్ కె మీదే ఉంది. ఆదిపురుష్, సలార్ సినిమాల తర్వాత రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నందుకుంటుందని అందరూ ఎంతగానో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.
ఎలాగైనా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కెతో మ్యాజిక్ చేస్తాడని భావిస్తున్నారంతా. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అప్డేట్తోనే చిత్ర యూనిట్ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు. దీనికి సంబంధించిన బిజినెస్ ను కూడా అప్పుడే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవైపు షూటింగ్ జరుగుతుంటే, మరోవైపు అశ్వినీదత్ సినిమాను మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయమై ఆలోచిస్తున్నాడు.
ప్రాజెక్ట్ కె కు సంబంధించిన అప్డేట్స్ పెద్దగా రాకపోయినా కొన్ని ఏరియాల నుంచి భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నైజాంకు చెందిన సెద్ద సిండికేట్ గ్రూప్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను దాదాపు 70 కోట్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏషియన్ సునీల్, ప్రొడ్యూసన్ సురేష్ బాబు చాలా కాలం నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్‌ను కొనసాగిస్తున్నారు.
గతంలో సీతారామం, కార్తికేయ2, రీసెంట్గా ధమాకా మూవీలను గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఈ సిండికేట్ ఇప్పుడు అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె నైజాం రైట్స్‌ను కూడా భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ఇప్పటివరకు సెట్ అయిన మొదటి డీల్ ఇదే అనుకోవచ్చు. నైజాం లోనే ఈ తరహాలో డీల్ కుదిరిందంటే ఇక మిగిలిన ఏరియాలలో ఇంకా అద్భుతమైన డీల్స్ కుదిరే ఛాన్సుంది. 500 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్న అశ్వినీదత్‌కు ఈ సినిమా ఎంతటి లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి మరి.













