ఇండియన్ స్క్రీన్ పైనే అరుదు అనేలా సలార్ సీన్స్
ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ లైనప్ చూసి అందరికీ ఎంతో ముచ్చటేస్తుంది. ఆదిపురుష్ రిలీజ్ కు దగ్గర పడుతుంది. ఇక సలార్ సినిమా గురించే అందరి ఇంట్రెస్ట్. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అసలు ఆ హీరో ఎవరో కూడా తెలియని యశ్ తో కేజీఎఫ్ తీసి, తెలుగు ప్రేక్షకులతో సైతం తన మాస్ ఎలివేషన్లతో విజిల్స్ వేయించేలా చేసిన ప్రశాంత్ నీల్, సలార్ లో ప్రభాస్ కు ఏ రేంజ్ ఎలివేషన్ సీన్లు రాశాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలితో తిరుగులేని క్రేజ్ సంపాదించిన ప్రభాస్ లాంటి స్టార్ తో ఇలాంటి సీన్లు చేస్తే అవి వెండితెరపై ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.
అందుకే ఈ సినిమా నుంచి ఏ చిన్న పోస్టర్ రిలీజ్ అయినా సరే ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, సలార్ లో యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ పీక్స్ లో ఉంటాయని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని వారు చెప్తున్నారు. అంతే కాదు సినిమాలో ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే సీన్లు కోకొల్లలని అంటున్నారు.
హీరో ఇంట్రడక్షన్ నుంచి, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా ప్రతీదీ దేనికదే స్పెషల్ గా ఉండేట్లు ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ తెరకెక్కించాడట. ఇండియన్ స్క్రీన్ పైనే ఇలాంటి సీన్లు అరుదు అనేలా సలార్ లో ఎలివేషన్ సీన్స్ ఉంటాయని, క్లైమాక్స్ కూడా 400 మంది రౌడీలతో ప్రభాస్ తలపడేలా భారీగా తెరకెక్కించారని అంటున్నారు. మరి సలార్ ప్రభాస్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏ రేంజ్ కిక్ ఇస్తుందో చూడాలి.













