ప్రభాస్ కెరీర్ లోనే మొదటిసారి అలా..
ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ లాంటి భారీ పాన్ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్, వీటితో పాటుగా మారుతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి నుంచి వచ్చిన ఆఖరి సినిమా పక్కా కమర్షియల్ డిజాస్టర్ అయినా సరే ప్రభాస్, మారుతిని నమ్మి సినిమా ఇచ్చి, సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కుదిరనప్పుడల్లా మారుతికి డేట్స్ ఇస్తూ ఈ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్.
ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ మూవీ కోసం ఓ కొత్త లుక్ ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ లుక్ ఇలా ఉండబోతుందంటూ దాని గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ ప్రచారం మొదలైంది.
ఈ లుక్లో ప్రభాస్, లుంగీతో కనిపించనున్నాడట. ఇన్నేళ్ల ప్రభాస్ కెరీర్లో ప్రభాస్ కనిపించనుండటం ఇదే తొలిసారి. బాహుబలి తర్వాత ప్రభాస్ అంటేనే ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు జనాలు. అందుకే వాటన్నింటిని పక్కన పెట్టి, ఈ లుక్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట డైరెక్టర్ మారుతి. ఈ ఫస్ట్ లుక్ తోనే సినిమా మాంచి ఎంటర్టైనర్ అని తెలిసేలా మారుతి దీన్ని ప్లాన్ చేశాడట.
హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్గా మాళవిక మోహనన్ నటిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు లేకపోవడంతో సినిమాను అసలు అనౌన్స్ చేయకుండానే సెట్స్ కు తీసుకెళ్లారు. కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత నుంచి ఈ సినిమాకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేశారట మేకర్స్.













