Spirit: స్పిరిట్ లో ప్రభాస్ కొత్త గెటప్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి(maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab) తో పాటూ, హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fauji) సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో రాజా సాబ్ షూటింగ్ దాదాపు ఆఖరి స్థాయికి రాగా, ఫౌజీ మాత్రం ఇంకొంచెం ఎక్కువ పెండింగ్ ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ స్పిరిట్(Spirit) మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.
అర్జున్ రెడ్డి(arjun reddy), యానిమల్(animal) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పవర్‌ఫుల్ కాప్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ కొత్త గెటప్ ట్రై చేస్తాడని తెలుస్తోంది.
స్పిరిట్ లోని ఈ సీక్వెన్స్ లో ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సీక్వెన్స్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్(Harsha vardhan rameswar) తో సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్(T series), భద్రకాళి పిక్చర్స్(Bhadrakali pictures) భారీ స్థాయిలో స్పిరిట్ ను నిర్మిస్తున్నాయి.