నెగిటివ్ రోల్ లో ప్రభాస్?
దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రభాస్ నెం.1 ప్లేస్ లో ఉన్నాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయినా సరే అతని సినిమాలకు డే 1 కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. సినిమా సినిమాకీ ప్రభాస్ రేంజ్ పెరిగిపోతుంది.
కల్కి సినిమాతో ఇప్పటికే రూ.1100 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసిన ప్రభాస్ ఇప్పటికీ ఆ సినిమా ద్వారా డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. చూస్తుంటే ప్రభాస్ నుంచి రానున్న తర్వాతి సినిమాల విషయంలో కూడా ఇదే బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
యానిమల్ తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తుండగా, అందులో ఓ పాత్ర పవర్ఫుల్ పోలీసాఫీసర్ అని, రెండో పాత్ర గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, విలన్ పాత్రలో ప్రభాస్ ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తాడని, మోస్ట్ వయొలెంట్ గా ఈ క్యారెక్టర్ ను సందీప్ డిజైన్ చేశాడని అంటున్నారు. మరి ఇదెంత వరకు నిజమన్నది తెలియదు కానీ ఈ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జయిట్ చేస్తోంది.













