Prabhas: నెగిటివ్ రోల్ లో ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. రీసెంట్ గా మంచు విష్ణు(manchu vishnu) కన్నప్ప(kannappa) సినిమాలో రుద్రగా కనిపించి అందరినీ మెప్పించిన ప్రభాస్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తన లుక్స్ తో, కటౌట్ తో దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు యాంటీ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారట.
ఇప్పటికే సలార్(salaar) లో గ్రే షేడ్ ను ట్రై చేసిన ప్రభాస్, ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మరో అడుగు ముందుకేయాలని చూస్తున్నారట. అందులో భాగంగానే ప్రభాస్ రీసెంట్ గా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ సినిమాలో ప్రభాస్ ఫుల్ లెంగ్త్ యాంటీ హీరోగా చేయనున్నారంటున్నారు. కథ నచ్చడంతో ప్రభాస్ కేవలం ఒక్క సిట్టింగ్ లోనే ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రభాస్ కు కథ చెప్పిన డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియలేదు కానీ ఆ మూవీలో ప్రభాస్ మాస్ లుక్ లో యాంటీ హీరోగా కనిపించనున్నారని, ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్లో చేయని క్యారెక్టర్ లో ఆ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. భారీ బడ్జెట్ తో ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ దీన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించనుందని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది విని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.