ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న ఆది పురుష్, సలార్ సినిమాల కంటే ముందే అనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఇంకా షూటింగ్ మొదలవలేదు. ఎంతో గొప్ప సోషియో ఫాంటసీ కథతో వైజయంతీ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ను జులై లో మొదలెట్టేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే నటిస్తుంటే, అమితాబ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఖర్చుతో సెట్స్ వేయిస్తున్నారట. ఇప్పటికే ఆ పనులు కూడా మొదలయ్యాయని, ఈ సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు నాగ్ అశ్విన్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రప్పిస్తున్నాడని, వచ్చే సంవత్సరం ఆఖరికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.













