స్టార్డమ్ లేని హీరోయిన్లతో ప్రభాస్ సినిమాలు
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటివరకు డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా మారిపోయాడు. ప్రభాస్ తో సినిమా చేయడమంటే మాటలు కాదు. స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు క్యాస్టింగ్ విషయంలో కూడా అతని రేంజ్ కు తగ్గట్టు మిగిలిన నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
కానీ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లను సెలెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్లు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ది రాజా సాబ్ అనే హర్రర్ కామెడీ కోసం మారుతి స్టార్ హీరోయిన్లను తీసుకోలేదు. రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లాంటి స్టార్డమ్ లేని హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకున్నాడు.
ఇక రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయిన హను రాఘవపూడి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయెల్ అనే యంగ్ డ్యానర్ ను ఎంపిక చేసుకున్నారు. ఇమాన్వి తన డ్యాన్స్ వల్ల సోషల్ మీడియాలో ఫేమస్ అయింది తప్పించి నటిగా మాత్రం సినీ ఇండస్ట్రీకి కొత్తే. ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండదు. దానికి తోడు స్టార్ హీరోయిన్లంతా వేరే భాషల్లో బిజీగా ఉండటం, పైగా స్టార్ హీరోయిన్లుంటే సినిమాకు ఓవర్ హైప్ ఉంటుందని అలా కాకుండా కొత్త ఫేసెస్ అయితే హైప్ ఎక్కువగా లేకుండా కథ పరమైన ఫోకస్ ఎక్కువగా ఉంటుందనే కారణంతో కూడా మేకర్స్ స్టార్డమ్ లేని ఫ్రెష్ ఫేసెస్ ను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం ఆయా హీరోయిన్ల కెరీర్ కు మాత్రం చాలా ప్లస్ అవుతుంది.













