ప్రభాస్ సినిమా చంద్రముఖిని మించి ఉంటుందట!
ప్రభాస్‌ను లవర్ బాయ్ గా చూడాలని ఎంతో కాలం నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఈ లుక్ లోనే కనిపిస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ మారుతి కలయికలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.
వాస్తవానికి సినిమా మొదలైనప్పుడు దీనికి రాజా డీలక్స్ అని, రాయల్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి కానీ ఫైనల్ గా చిత్ర యూనిట్ మొత్తం రాజా సాబ్ కే ఓటేయడంతో ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. జనవరి 15న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా హార్రర బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కమర్షియల్ హంగులతో ఉండనుందని, ఈ సినిమాను మారుతి చాలా ఎంటర్టైనింగ్ గా తీర్చి దిద్దుతున్నాడని టాక్.
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో దెయ్యాల సినిమా రిస్క్ కాదా అని మారుతిని అడిగితే చంద్రముఖి రికార్డులను గుర్తు చేస్తున్నాడట. చంద్రముఖిని మించి తమ సినిమా ఉంటుందని, ఆత్మల ప్రస్తావన ఉన్నా ఈ సినిమాను రొటీన్ హార్రర్ సినిమాలా కాకుండా కొత్త తరహాలో తెరకెక్కిస్తున్నామని మారుతి చెబుతున్నాడు. సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నట్లు సమాచారం.













