స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ఫిక్స్
వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను, హను రాఘపపూడి దర్శకత్వంలో ఓ సినిమాను సమాంతరంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇప్పటికే కమిట్ అయిన స్పిరిట్ ను చేయనున్నాడు.
ఈ లోపు రాజా సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న స్పిరిట్ కు స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తైనట్లు తెలుస్తోంది. డైలాగ్ వెర్షన్ ను రెడీ చేస్తున్నట్లు సందీప్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరోవైపు స్పిరిట్ కోసం యాక్టర్ల ఎంపిక, డిజైన్స్, హీరోహీరోయిన్ల ప్రీ లుక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడట సందీప్.
తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ లో ప్రభాస్ ను ఎలా చూపించాలనే విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. టెక్నాలజీని వాడి దాదాపు వారం రోజుల పాటూ వర్క్ చేశాక ప్రభాస్ లుక్ ను కన్ఫర్మ్ చేశాడట సందీప్. స్పిరిట్ లో ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ ఫిదా అయ్యేలా ఈ లుక్ ను సందీప్ డిజైన్ చేశాడని సమాచారం. కాగా స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ చెప్పాడు.













