కన్నప్పకు డేట్స్ ఇచ్చిన ప్రభాస్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టయిన కన్నప్ప సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధు బాల లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తోంది. ముకేష్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత మంచు విష్ణు, ప్రభాస్ క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చాడు. కన్నప్పలో ప్రభాస్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని, టైమొచ్చినప్పుడే ఆ రోల్ కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని విష్ణు తెలిపాడు. దీంతో ప్రభాస్ పాత్ర విషయంలో అందరికీ మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ తో పాటూ కైలాసంలోని శివపార్వతులకు సంబంధించిన షాట్స్ ను చేయాలని మేకర్స్ డిసైడయ్యారట.
ఇందులో భాగంగానే ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేయడానికి కన్నప్ప టీమ్ కు ఐదు రోజుల కాల్షీట్స్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే కన్నప్ప కోసం స్పెషల్ సెట్స్ ను వేశారు. మరి అందరూ అనుకున్నట్లు ఈ సినిమాలో ప్రభాస్, శివుడి గెటప్ లోనే కనిపించనున్నాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.













