కల్కి ఫస్ట్ గ్లింప్స్‌లో ఇవి చూశారా?
శ్రీ మహావిష్ణువు 11వ అవతారంగా కల్కి మళ్లీ అవతరిస్తాడనే విషయాన్ని మైథాలజీలో మనం చదువుకున్నాం. శంభల అనే ప్రాంతం నుంచి వచ్చిన అతను దుష్టశక్తుల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఈ మానవులని రక్షిస్తాడని, కల్కి పరశురాముడి దగ్గర విద్యనభ్యసించి అతని నుంచి అన్ని రకాల దైవ శక్తులని పొందుతాడని పురాణాల్లో చెప్పబడింది.
ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న Kalki 2898AD మూవీ ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే పైన చెప్పినవన్నీ కనిపిస్తున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతుంది. ప్రాజెక్టె క్ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్‌ని స్టార్ట్ చేసిన మేకర్స్ రీసెంట్ గా కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గ్లింప్స్ లో కొన్ని అంశాలను చాలా క్లియర్ గా చూపించాడు నాగ్ అశ్విన్. స్టార్టింగ్‌లో విలన్ చేతిలో హనుమాన్ లాకెట్, అది పట్టుకోగానే చేతులు వణకడం, ఓ గుహలో పరశురాముడులో తపస్సులో ఉండటం, అతన్నుంచి హీరో కల్కి అందుకున్న పరుశవేది ఆయుధం, సుదర్శన చక్రం, గుహలో శివలింగం, పరశురాముడు జ్ఞాన యోగం నుంచి లేచి నందక ఖడ్గం ప్రయోగించిన విజువల్స్ అన్నీ చూపించారు. ఫస్ట్ గ్లింప్స్ లోనే నాగి ఇంతగా ఆడియన్స్ ను మెప్పించాడంటే ఇక సినిమాతో ఎలాంటి వండర్స్ సృష్టిస్తాడో చూడాలి.













