ప్రభాస్ మళ్లీ షూటింగ్లో జాయిన్ అయేదప్పుడే
పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్‌స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం యూరోప్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడా సర్జరీ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత కొంతకాలం పాటూ ప్రభాస్ యూరోప్‌లోనే విశ్రాంతి తీసుకోనున్నాడట. అక్టోబర్ మొత్తం రెస్ట్ తీసుకుని, నవంబర్ నుంచి తిరిగి షూటింగ్లో పాల్గొననున్నాడట ప్రభాస్.
ఎప్పటినుంచో మోకాలి గాయంతో బాధపడుతన్న ప్రభాస్, ఇన్నాళ్లకు సలార్ షూటింగ్ పూర్తి చేసి సర్జరీ చేయించుకున్నాడు. దీని నుంచి కోలుకున్న తర్వాత ప్రభాస్ కల్కి, రాజా డీలక్స్ సినిమాల షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ప్రభాస్ ముందు కల్కి సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట.
కల్కి తర్వాత రాజా డీలక్స్ సినిమాను కంప్లీట్ చేసి, ఆ తర్వాత మళ్లీ ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. అంటే వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలను స్టార్ట్ చేయనున్నారన్నమాట. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ ఏడాది లేక వచ్చే సంవత్సరం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ తన ఫ్యామిలీతో చెప్పడంతో అందరూ ఆ న్యూస్ కోసం కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.













