భక్త కన్నప్పలో ప్రభాస్
మంచు విష్ణు నుంచి సరైన సినిమా వచ్చి చాలా ఏళ్లే అయింది. మధ్యలో ఏవో సినిమాలు తీసినా సరే అవేమీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మంచి టాక్ తెచ్చుకోలేకపోయాయి. రీసెంట్గా విష్ణు కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో భక్త కన్నప్ప సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందన్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న భక్త కన్నప్పలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ క్యామియో చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్యామియో కోసం ప్రభాస్‌ను సంప్రదించగా దానికి వెంటనే డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ చేయబోయే క్యారెక్టర్ కూడా మహాశివుడి క్యారెక్టర్ అని ఇన్సైడ్ టాక్.
ఈ విషయమై నెట్టింట పలువురు ట్వీట్స్ చేస్తుండగా, అందులో ఓ ట్వీట్ కు విష్ణు స్పందిస్తూ హరహరమహదేవ్ అటూ రీ కోట్ చేయడంతో ఈ న్యూస్ నిజమేనని కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకోవడానికి రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి భక్త కన్నప్ప అనేది ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్. రెండోది మంచు ఫ్యామిలీతో ప్రభాస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం.
ఈ రెండు రీజన్స్ వల్లే ప్రభాస్ ఈ సినిమాలో క్యామియో చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది? విష్ణు-ప్రభాస్ కాంబోలో ఎలాంటి సీన్స్ వస్తాయనేది ప్రస్తుతానికైతే ఏమీ తెలియదు. మొత్తానికి ప్రభాస్ ఈ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాడని తెలియగానే ఈ సినిమాకు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేసింది.













