ప్రభాస్ తో సినిమా.. బోనస్ గా పబ్లిసిటీ
ప్రభాస్ కు మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అలాంటి ప్రభాస్ తో నటిస్తే హీరోయిన్లకు ఓ రేంజ్ లో పబ్లిసిటీ దొరుకుతుంది. అదెలా అంటారా? ప్రభాస్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఒకే హీరోయిన్ రిపీట్ అయిన సందర్భాలన్నాయి. అలాంటి టైమ్ లో ఆ హీరోయిన్ తో ప్రభాస్ ఎఫైర్ పెట్టుకున్నాడని ప్రచారాలు జరిగాయి.
వర్షం తర్వాత త్రిష తో కలిసి పౌర్ణమి చేశాడు. దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారన్నారు. దానికి తోడు మళ్లీ ఇద్దరూ కలిసి బుజ్జిగాడు చేయడంతో ఆ వార్త ఇంకా ఎక్కువ ప్రచారమైంది. సోషల్ మీడియా పెద్దగా లేకపోవడం వల్ల విషయం ఎక్కువగా బయటకు రాలేదు. ఆ తర్వాత ప్రభాస్ అనుష్క కలిసి పలు సినిమాల్లో నటించారు.
వీరిద్దరూ కలిసి చేసిన మొదటి సినిమా బిల్లా, ఆ తర్వాత మిర్చి, బాహుబలి చేశారు. దీంతో వీరిద్దరూ ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారాలు చేశారు. డార్లింగ్ చేస్తున్నప్పుడు కాజల్ తో కూడా ఇదే తరహా వార్తలొచ్చాయి. సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో కూడా ప్రభాస్ లవ్ స్టోరీ నడిపాడని వార్తలొచ్చాయి. తర్వాత ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ పెళ్లి జరగనుందని అన్నారు. ఇక ఇప్పుడు కల్కి సినిమా వంతు. ఆ సినిమాలో నటిస్తున్న దిశా పటానీతో ప్రభాస్ క్లోజ్ గా ఉన్నాడని, వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా వారి మధ్య ఏం లేకపోయినా ప్రభాస్ తో నటించిన దానికి ఇలాంటి వార్తలతో ప్రపంచమంతటా ఆయా హీరోయిన్లకు క్రేజ్ దక్కుతుంది.













