Prabhas: తండ్రి చనిపోయినప్పుడు కూడా తోటి మనిషికి సాయం చేసిన ప్రభాస్
తోట ప్రసాద్(Thota Prasad) పలు తెలుగు సినిమాలకు రైటర్ గా పని చేశాడు. తాజాగా ఆయన ప్రభాస్(Prasad) గొప్పదనాన్ని వెల్లడించాడు. ప్రభాస్, తోట ప్రసాద్ కలిసి బిల్లా మూవీకి వర్క్ చేశారు. బిల్లా(Billa) కథ డిస్కషన్ కోసం వెళ్లినప్పుడు ఆయన చేసిన గౌరవ మర్యాదల గురించి ఎంతో గొప్పగా చెప్పిన తోట ప్రసాద్, తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభాసే తనకు హెల్ప్ చేసినట్టు తెలిపాడు.
2010లో ఆరోగ్యం బాలేక తాను హాస్పిటల్ లో ఉంటే, అదే టైమ్ లో ప్రభాస్ తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ తనకు తెలిసిన వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రభాస్ ఆలోచించి, తన పర్సనల్ డబ్బుని హాస్పిటల్ ఖర్చుకు పంపాడని, ఆయన అంత గొప్ప వ్యక్తి అని తోట ప్రసాద్ ప్రభాస్ గొప్పదనాన్ని వెల్లడించాడు.
బిల్లా తర్వాత ఆయనతో ఇప్పటివరకు మళ్లీ పని చేయలేదని, ఇప్పుడు మళ్లీ కన్నప్ప(Kannappa) సినిమా ద్వారా తనకు ఆ అవకాశం దక్కిందని, ప్రభాస్ లాంటి వ్యక్తితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని తోట ప్రసాద్ తెలిపాడు. విష్ణు మంచు(Vishnu Manchu) ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాకు తోట ప్రసాద్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడు. కన్నప్పలో ప్రభాస్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
https://x.com/BheeshmaTalks/status/1893870077360943380













