ఇంతకీ ప్రభాస్ చెప్పనున్న ఆ గుడ్న్యూస్ ఏంటి?
పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాని ఊపేస్తుంది. హలో డార్లింగ్స్! చివరకు చాలా స్పెషల్ అనిపించే ఒకరు నా జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు, వెయిట్ చేయండని ప్రభాస్ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాలకే ఆ పోస్ట్ విపరీతంగా వైరలైంది. కొన్ని న్యూస్ ఛానెల్స్ అయితే ఏకంగా ఇది ప్రభాస్ పెళ్లి గురించేనని లైవ్ షోలు నిర్వహించాయి.
వాస్తవానికి ఆ పోస్ట్ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన క్లూ అన్నట్లు అనిపిస్తున్నప్పటికీ అంతర్గత సమాచారం ప్రకారం అదేమీ కాదని తెలుస్తోంది. అసలు విషయానికొస్తే కల్కి 2898 ఏడీ ప్రమోషన్లకు టైమొచ్చింది. రిలీజ్ కు మరో 40రోజులు మాత్రమే టైముంది. ఈ నేపథ్యంలో రోజుకో అప్డేట్ లేదా ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ కు రెగ్యులర్ టచ్ లో ఉంటేనే ఓపెనింగ్స్ కు బూస్ట్ అవుతుందనే ఉద్దేశంలో ప్రభాస్ ఈ పోస్ట్ పెట్టుండొచ్చంటున్నారు.
ప్రభాస్ నిజంగా పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే ఇన్స్టా ద్వారా కాకుండా మరో రూపంలో దాన్ని రివీల్ చేస్తాడు. కల్కి వేడిలో ఎలాంటి వ్యక్తిగత ముచ్చట్లు ఉండవని మర్చిపోకూడదు. ప్రభాస్ చెప్పబోయేది కల్కి సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ లేదా మెయిన్ టీజర్ కు సంబంధించింది అయుండొచ్చు. ఇంతకీ ఆ విషయం ఏంటన్నది తెలుసుకోవడానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.













