సైలెంట్‌గా ఉంటే ఎలా సలార్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే మంచి హైప్ నెలకొంది. సలార్ నుంచి ఇప్పటివరకు కనీసం సరిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. టీజర్ లో కూడా ప్రభాస్ ఫేస్ సరిగా రివీల్ చేయలేదు. డిసెంబర్ 22న సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంటే రిలీజ్ కు పట్టుమని 50 రోజులున్నాయంతే. అయినా కూడా టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను వదలడం లేదు. మొన్నీమధ్య ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న ట్రైలర్ రిలీజ్ అన్నారు కానీ కనీసం కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేకపోయారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సలార్ నుంచి ఓ టీజరో, సాంగో రిలీజ్ చేస్తే ప్రేక్షకుల్లో సినిమాపై ఆ హైప్ తగ్గకుండా ఉంటుంది.
ఎప్పటికప్పుడు సలార్ ప్రమోషన్స్ భారీగా చేయబోతున్నారని నెట్టింట హైప్ ఇవ్వడమే తప్పించి, సలార్ మేకర్స్ మాత్రం ఆ దిశగా అడుగులేయట్లేదనేది వాస్తవం. ఈ సినిమాకు పోటీగా వస్తున్న డంకీ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. త్వరలో మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట డంకీ టీమ్ మెంబర్స్. కానీ సలార్ యూనిట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వ్యవహరించడం ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, సగటు సినీ లవర్స్ కు కూడా నచ్చడం లేదు.













