ఒకేసారి మూడు చేయనున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. ఈ ఇయర్ ఇప్పటికే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ తనకు బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి2 తర్వాత కల్కితో ప్రభాస్ మరో రూ.1000 కోట్ల సినిమాను అందుకున్నాడు. ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా సరే ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు లైన్ లో పెట్టాడు.
ప్రతి ఏడాది కనీసం ఒకటి లేదా రెండు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్రభాస్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. మిగిలిన హీరోలందరూ రెండేళ్లకి ఒక సినిమా కూడా చేయడం గగనమైపోతున్న ఈ రోజుల్లో ప్రభాస్ మాత్రం తన ప్లానింగ్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టి వరుస రిలీజ్ లు ఉండేలా చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రభాస్ నుంచి ది రాజాసాబ్ థియేటర్లలోకి రానుంది. దీంతో పాటూ హను రాఘవపూడి సినిమాను కూడా ప్రభాస్ స్టార్ట్ చేశాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్2 కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటూ సలార్2 కూడా లైన్ లో ఉంది. అయితే వీటిలో రాజా సాబ్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ నవంబర్ కు కంప్లీట్ కానుంది.
ఆ తర్వాత హనుతో ఫౌజీ, సందీప్ తో స్పిరిట్, నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాలను ఒకేసారి మొదలుపెట్టనున్నాడట. ప్రస్తుతం ఫౌజీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అది పూర్తైతే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు ప్రభాస్. దీంతో పాటూ స్పిరిట్, కల్కి సినిమాలను కూడా ప్రభాస్ సమాంతరంగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రభాస్ ఈ సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యాడట.













