Prabhas: ఈసారి ప్రభాస్ బర్త్ డే అక్కడే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో మారుతి(maruthi) దర్శక్వంలో చేస్తున్న ది రాజా సాబ్(the raja saab) సినిమా షూటింగ్ ను ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేర్చారు డార్లింగ్. రీసెంట్ గా రాజా సాబ్ మూవీ చూసుకున్న ప్రభాస్, ఆ సినిమా అవుట్ పుట్ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందారని, ఆ శాటిస్‌ఫ్యాక్షన్ తోనే పెండింగ్ షూటింగ్ ను ఫినిష్ చేయడానికి గ్రీస్ వెళ్లారు.
కాగా రాజా సాబ్ షూటింగ్ టాకీ పార్ట్ ఆల్రెడీ పూర్తవగా, సినిమాలో మరో రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ రెండు సాంగ్స్ కు సంబంధించిన షూటింగ్ గ్రీస్(greece) లో జరగనుండగా, ప్రభాస్ దాని కోసం గ్రీస్ వెళ్లారని సమాచారం. ఆ బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలను తెరకెక్కిస్తే దాదాపు రాజా సాబ్ షూటింగ్ పూర్తైపోతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజనే విషయం తెలిసిందే. అయితే ఈసారి పుట్టినరోజును ప్రభాస్ ఇటలీ(Italy)లోనే జరుపుకోనున్నారని, రాజా సాబ్ షూటింగ్ లో భాగంగా ఇటలీ వెళ్లిన డార్లింగ్ అక్కడే తన బర్త్ డే ను కూడా చేసుకోనున్నారని, ప్రభాస్ తిరిగి ఇండియాకు వచ్చేది రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యాకే అని తెలుస్తోంది. కాగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ మేకర్స్ ఫస్ట్ సింగిల్(raja saab first single) ను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.