ప్రభాస్ సరసన సమంత ?
ప్రస్తుతం టాలీవుడ్లో ఓ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన జోడీ సెట్ కాబోతుందని సమాచారం. తొలిసారి ప్రభాస్, సమంత కలిసి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని దిల్‌రాజు సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా దిల్ రాజు ఓ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్ర కోసం సమంతని సంప్రదిస్తే, నటించేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారట. అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం సమంత ఓ బేబీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్వరలో దిల్ రాజు నిర్మించబోయే 96 రీమేక్‌లో శర్వానంద్‌కి జోడీగా మెరవబోతున్నారు. ఇదీ మేలో ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నారు. స్టయిలీష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.













