శ్రీరామనవమికి రాముడిగా దర్శనమివ్వనున్న ప్రభాస్ !
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది. తన కెరీర్ ని బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పుకునేంతగా మార్చుకున్నారు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అన్ని చిత్రాలు కూడా అదే తరహాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సలార్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో కృతిసనన్ ఇప్పటికే ఖరారైంది. రాముడికి ఎల్లప్పుడూ పక్కనే ఉండే అతి శక్తివంతమైన లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించబోతున్నాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నేను పని పనిచేస్తుండటం మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిస్తుందని సన్నీ సింగ్ మీడియాతో చెప్పుకొచ్చారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. వచ్చే నెల ఏప్రిల్ 21 న ‘ శ్రీరామ నవమి’ సందర్భంగా ప్రభాస్ రాముడి గెటప్ లోని ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తుందట. ఇప్పటివరకు కాన్సెప్ట్ పోస్టర్ తో టైటిల్ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని ఆలోచిస్తున్నారట.













