ప్రభాస్-మైత్రీ సినిమా ఇప్పట్లో లేనట్లా?
ఓ వైపు ఆదిపురుష్, మరోవైపు సలార్. ఇంకోవైపు ప్రాజెక్ట్ కె. వీటితో పాటూ మారుతీతో ఓ సినిమా. ఇలా ఏ స్టార్ హీరో లేనంత బిజీగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇవి కాకుండా ఇంకా అనౌన్స్ చేయనివి, గతంలో ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగానే మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ పాన్ ఇండియా మూవీ బాకీ ఉన్నాడు ప్రభాస్.
పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్- ప్రభాస్ కాంబోలో మైత్రీ వారు ఈ భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ ను అనుకున్నారు. దాని కోసం రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ను మాట్లాడుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే అతను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతున్న ఫైటర్ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫాస్టప్ చేయాలి. దీనికోసం ఆనంద్ నెలల తరబడి టైమ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇది కాకుండా టైగర్ వర్సెస్ పఠాన్ స్క్రిప్ట్ ఏడాది పైనే టైమ్ పడుతుంది. 2024లో మొదలుపెట్టి ఆ తర్వాత సంవత్సరం రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రభాస్ తో సిద్దార్థ్ ఆనంద్ అనుకున్నా కూడా కనీసం స్టోరీ కూడా రెడీ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే వార్2 చేతులారా అయాన్ ముఖర్జీకి వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అడ్వాన్స్ ని సిద్దార్థ్ మైత్రీ నిర్మాతలకు వెనక్కు ఇచ్చేసినట్లు ముంబై టాక్.
ఫ్యూచర్ లో మళ్లీ ఈ కాంబో సెట్ చేసుకునేలా అనుకుని డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ త్వరలోనే ఆదిపురుష్ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నాడు. సలార్ బ్యాలెన్స్ షూట్ జూన్ ఎండింగ్ లో స్టార్ట్ చేయనున్నాడు. వీటితో పాటు ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను కూడా ప్రభాస్ సమాంతరంగా చేస్తున్నాడు.













