బెల్లం బాబు భలే టైటిల్స్ ను పట్టేస్తున్నాడుగా
ఫలితంతో సంబంధం లేకుండా కెరీర్ స్టార్టింగ్ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన సినిమా ఎలా ఉన్నా సరే రీమేక్ రైట్స్ మాత్రం భారీ రేటుకు అమ్ముడుపోయేవి. దీంతో నార్త్ లో తనకు ఎక్కువ క్రేజ్ ఉందని ఊహించుకుని ఎంతో కష్టపడి ఛత్రపతిని సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.
అంత పెద్ద ఫ్లాప్ పడినప్పటికీ ఆయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి టైసన్ నాయుడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది. దీంతో పాటూ కౌశిక్ పెగిళ్ల దర్శకత్వంలో కిష్కిందపురి అనే సినిమాను చేస్తున్నాడు శ్రీనివాస్. ఇది కాకుండా లుధీర్ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమాను చేస్తున్నట్లు రీసెంట్ గానే అనౌన్స్మెంట్ వచ్చింది.
ఈ సినిమాకు వామన అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా కోసం మరో రెండు టైటిల్స్ కూడా ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వామన తో పాటూ హైందవ, ఉద్భువ అనే టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నారట. ఈ మూడు టైటిల్స్ లో ఒక టైటిల్ ను ఫైనల్ చేయడం చిత్ర యూనిట్ కు పెద్ద పనైందిప్పుడు. వామన టైటిల్ బావుంటుందని కొందరంటుంటే, సినిమా కథకు హైందవ అనే టైటిల్ అయితే సరిగా యాప్ట్ అవుతుందని మరికొందరుంటున్నారట. ఇదంతా చూసి శ్రీనివాస్ తన సినిమాకు భలే టైటిల్స్ ను పడుతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













