రౌడీ హీరో సినిమాకు పవర్ఫుల్ టైటిల్
ఫ్యామిలీ స్టార్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన వేగాన్ని మరింత పెంచాడు. కెరీర్లో ఇకపై ఏ మాత్రం గ్యాప్ తీసుకోకూడదని ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు విజయ్. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరితో కాగా మరొకటి ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్, మరొకటి రవికిరణ్ కోలాతో. ఈ మూడు సినిమాలు విజయ్ గత సినిమాల కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటించబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రెండు క్యారెక్టర్లలో కనిపించబోతున్నట్లు టాక్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బ్రిటీష్ నేపథ్యమున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలోనే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.
ఒకవైపు తండ్రిగా మరొకవైపు కొడుకుగా విజయ్ యాక్టింగ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు రణబలి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితేనే సినిమా కథకు చాలా బాగా యాప్ట్ అవుతుందని మేకర్స్ దీనిపైనే దృష్టి పెడుతున్నారట.ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్ పెయిర్ గా మార్కులేసుకున్న విజయ్- రష్మిక ఈ సినిమాతో ఆడియన్స్ ను ఎలా అలరిస్తారో చూడాలి.













