ఆపరేషన్ వాలెంటైన్ కు ప్లస్ మైనస్సులు అవే
మార్చి 1న రిలీజ్ కానున్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెగ కష్ట పడిపోతున్నాడు. అడిగిన వాళ్లకు కాదనకుండా ఇంటర్వ్యూలిస్తూ వివిధ ప్రాంతాలకు తిరుగుతూ సినిమా గురించి వివరాలను అందిస్తున్నాడు. ఇంత చేస్తున్నా సినిమాపై కావాల్సినంత బజ్ లేదు. వరుణ్ గత రెండు సినిమాలూ డిజాస్టర్లవడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై చాలా గట్టిగా కనిపిస్తోంది.
అయితే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడటంలో ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. మొదటిది ఈ సినిమాకు హృతిక్ రోషన్ ఫైటర్ మూవీతో పోలికలు ఉండటం. బాలీవుడ్ లో ఇది చాలా పెద్ద రిస్క్. దానికి తోడు ఈ సినిమా వరుణ్ కు హిందీలో డెబ్యూ సినిమా లాంటిది. ఇంతకంటే పెద్ద కాన్వాస్ వరుణ్ కు అంత ఈజీగా దొరకదు.
ఈ సినిమా హిట్ అయితే వరుణ్ చేయబోయే తర్వాతి సినిమాలన్నింటినీ పాన్ ఇండియా బ్రాండ్ తో మార్కెట్ చేసుకోవచ్చు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కానీ మాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్లకు రావడం కష్టమే అనిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు పోటీగా పలు సినిమాలు కూడా రానున్నాయి. వెన్నెల కిషోర్ చారి 111 కు క్రమంగా హైప్ పెరుగుతుంది. ఇవి కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా ఆపరేషన్ వాలెంటైన్ తో పోటీ పడుతున్నాయి. మరి ఇన్ని అంశాల మధ్య రిలీజ్ కానున్న సినిమా వరుణ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













