ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఒక్క నియోజకవర్గం అయినా గెలిచారా రాజా? : పోసాని
పవన్ కల్యాణ్ తన ప్రశ్నలకు తనే సమాధానాలు చెప్పుకుంటారని సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. పవన్ ప్రశ్నించడంలో తప్పేం లేదని, ఆధారాలు చూపి పవన్ ప్రశ్నిస్తే బాగుండేదని హితవు పలికారు. పవన్ మాట్లాడిన బాష సరిగా లేదన్నారు. చిరంజీవి నోటి నుంచి అమర్యాద పదాలు ఎప్పుడైనా వచ్చాయా అని ప్రశ్నించారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని పోసాని నిలదీశారు. పవన్ కల్యాణ్ రెండు నియోజక వర్గాల్లో ఉన్నారు. రెండు చోట్ల తిరిగారు, ఒక్కచోట అయినా గెలవగలిగారా అని ప్రశ్నించారు.













