రజినీ మూవీలో ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనిర్స్లో భాగంగానే తెరకెక్కనుందని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా కోసం లోకేష్ భారీ క్యాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కీలక పాత్ర కోసం యంగ్ హీరో శివ కార్తికేయన్ ను ఎంపిక చేసిన లోకేష్, విలన్ గా రాఘవ లారెన్స్ ను లాక్ చేసుఉన్నట్లు తెలుస్తోంది. రజినీ మూవీ కావడంతో వెంటనే రాలెన్స్ కూడా ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడట.
వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ఆరు నెలల్లోపే సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడట లోకేష్. లియో సినిమాకు ఊహించిన రేంజ్ లో ఫలితం రాకపోవడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో లోకేష్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రజినీతో చేసే మూవీతో రూ.1000 కోట్ల మార్క్ ను రీచ్ కావాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.













